సినీ పరిశ్రమలో డబ్బే ముఖ్యం: నిర్మాత సురేశ్ బాబు
- ఇండస్ట్రీలో లాభాలు, నష్టాలు మాత్రమే మాట్లాడతాయి
- ఇక్కడ ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే పని చేస్తారు
- కరోనా వల్ల ఎగ్జిబిటర్లు మాత్రమే కాకుండా నిర్మాతలు కూడా నష్టపోయారు
సినీ పరిశ్రమలో డబ్బే లోకమని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కుండబద్దలుకొట్టి మరీ చెప్పారు. ఇండస్ట్రీలో కేవలం లాభాలు, నష్టాలు మాత్రమే మాట్లాడతాయని అన్నారు. సినిమా వ్యాపారంలో తప్పు, ఒప్పు అంటూ ఏమీ ఉండదని... ఇక్కడున్న ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే పని చేస్తారని అన్నారు. మానసిక తృప్తి కోసం ఈ సినిమా చేశాం అనే గొప్పగొప్ప మాటలు మాట్లాడినా... చివరికి అందరికీ కావాల్సింది డబ్బేనని చెప్పారు.
కరోనా వల్ల కేవలం ఎగ్జిబిటర్లు మాత్రమే కాకుండా నిర్మాతలు కూడా నష్టపోయారని సురేశ్ బాబు అన్నారు. ఇలాంటి తరుణంలో నిర్మాతలకు వారి ఇష్టానుసారం, వారికి ఇష్టమైన ప్లాట్ ఫామ్ లో విడుదల చేసుకునే హక్కు ఉంటుందని చెప్పారు. ఓటీటీలో సినిమాను విడుదల చేసుకునే హక్కు నిర్మాతలకుందని అన్నారు.