రఘురామకు త్వరలోనే నోటీసులు అందుతాయి: ఎంపీ మార్గాని భరత్
- స్పీకర్ కు 290 పేజీల సమాచారం అందజేత
- రఘురామ అంశాన్ని స్పీకర్ కు నివేదించామన్న భరత్
- రఘురామపై వేటు ఖాయమని వ్యాఖ్యలు
- స్పీకర్ విచక్షాధికారాలతో నిర్ణయం తీసుకుంటారని వెల్లడి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రఘురామపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీలు, తాజాగా 290 పేజీల సమాచారాన్ని ఆయనకు అందజేశారు. దీనిపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వివరించారు. రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని స్పీకర్ కు నివేదించామని, త్వరలోనే రఘురామకు నోటీసులు వస్తాయని వెల్లడించారు. స్పీకర్ తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని, స్పీకర్ విచక్షణాధికారాల మేరకు వ్యవహరించి రఘురామపై అనర్హత వేటు వేస్తారని భరత్ వెల్లడించారు. రఘురామ వైఖరి పార్టీ అధినేతకు, పార్టీ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు.