వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా రాణిస్తున్న ప్రియాంక గాంధీ తనయుడు

  • పదేళ్ల వయసు నుంచే కెమెరాపై మోజు
  • అడవులు, జంతువులే ప్రధాన టాపిక్
  • రైహాన్ తీసిన ఫొటోలతో ఎగ్జిబిషన్
  • భవిష్యత్తులోనూ ఫొటోగ్రఫీ కొనసాగిస్తానని వెల్లడి
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా దంపతుల తనయుడు రైహాన్ రాజీవ్ వాద్రా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. రైహాన్ వాద్రా వయసు 20 ఏళ్లు. పదేళ్ల వయసు నుంచే కెమెరాతో చెలిమి చేసిన ఈ సెలబ్రిటీ కుర్రాడికి తల్లి ప్రియాంక తొలి గురువు. తల్లి నుంచి ఫొటోగ్రఫీ మెళకువలు తెలుసుకున్న రైహాన్ అడవులను సందర్శిస్తూ, అక్కడి ప్రకృతి రమణీయతను, జంతువులను ఫొటోలు తీస్తూ మెప్పిస్తున్నాడు.

ఇప్పుడు రైహాన్ తీసిన వైల్డ్ లైఫ్ ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటైంది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అనేది తన జీవిత దృక్పథం అని ఈ జూనియర్ వాద్రా చెబుతున్నాడు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఇదొక అద్భుతమైన సాధనం అని తెలిపాడు. పొలిటికల్ ఎంట్రీపై ఇప్పుడే చెప్పలేనని, ఫొటోగ్రఫీని మాత్రం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నాడు.


More Telugu News