తగ్గిపోతున్న శ్రీశైలం నీటి మట్టం
- పూర్తిగా ఆగిపోయిన వరద నీరు
- ప్రస్తుత నీటి మట్టం 808.70 అడుగులు
- ఎడమగట్టు వద్ద కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీరు పూర్తిగా ఆగిపోయింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 808.70 అడుగులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 33.5771 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,063 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం డ్యామ్ కుడిగట్టు (ఏపీ) వద్ద విద్యుదుత్పత్తి జరగడం లేదు. ఎడమగట్టు (తెలంగాణ) వద్ద మాత్రం విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. పైనుంచి వరద నీరు ఆగిపోవడంతో జలాశయం నీటి మట్టం తగ్గిపోతోంది.