ఇద్దరు క్రికెటర్లు కలిసి పట్టిన క్యాచు.. వీడియో వైరల్!
- ఆస్ట్రేలియా-వెస్టిండీస్ టీ20 మ్యాచులో ఘటన
- బ్రేవో చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయిన బంతి
- వెంటనే పట్టేసిన మరో బౌలర్ ఫాబియన్ అలెన్
మ్యాచు జరుగుతోన్న సమయంలో ఫీల్డర్లు అద్భుత రీతిలో క్యాచులు పడితే అభిమానులు ఖుషీ అవుతారు. ఒక్కోసారి క్రికెటర్లు ఊహించని రీతిలో బంతిని ఒడిసిపట్టుకుంటారు. అటువంటి ఘటనే తాజాగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ టీ20 మ్యాచులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
విండీస్ బౌలర్ ఫాబియన్ అలెన్ బౌండరీ వద్ద తోటి ఆటగాడితో ఫీల్డింగ్ చేస్తూ అతడు జారవిడిచిన క్యాచును చాకచక్యంగా పట్టాడు. 12వ ఓవర్‌లో హెడెన్ వాల్స్ వేసిన ఐదో బంతిని కెప్టెన్ ఆరోన్ ఫించ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టాడు. దీంతో బౌండరీ దాటుతుందని అందరూ భావించారు. అయితే, బ్రేవో, అలెన్ ఆ బంతిని అడ్డుకునేందుకు పరిగెత్తుకొచ్చారు. బ్రేవో చేతికి చిక్కినట్లే చిక్కి ఆ బంతి జారిపోయింది.
దీంతో తన కాలుని అడ్డుపెట్టడంతో ఆ బాలు కింద పడకుండా ఎగిసింది. ఆ వెంటనే ఆ బంతిని అలెన్ అందుకున్నాడు. దీంతో ఫించ్ ఔటయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేయగా, వెస్టిండీస్ లక్ష్యాన్ని ఛేదించింది.