అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమపై హైకోర్టులో విచారణ.. న్యాయస్థానం ఆదేశాలు
- పరిశ్రమ నుంచి ప్రమాదకరస్థాయిలో సీసం
- నివేదిక సమర్పించిన పీసీబీ
- అభ్యంతరం వ్యక్తం చేసిన అమరరాజా న్యాయవాది
- తోసిపుచ్చిన కోర్టు!
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ కాలుష్యంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ వల్ల ప్రమాదకరస్థాయిలో సీసం ఉత్పన్నమవుతున్నట్టు పీసీబీ నివేదిక వెల్లడించింది. గాలిలో, నీటిలో, భూమిలో, కార్మికుల రక్తంలో సీసం ఆనవాళ్లు ఉన్నట్టు పీసీబీ తన నివేదికలో పేర్కొంది.
అయితే, పీసీబీ నివేదికపై అమరరాజా బ్యాటరీస్ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పగా, కోర్టు అమరరాజా తరఫు వాదనలను తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. నివేదికలోని అంశాలను సమగ్రంగా పరిశీలించినట్టు న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. సీసం స్థాయిని తగ్గించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని అమరరాజా సంస్థను ఆదేశించింది. లేకపోతే, పరిశ్రమ విషయంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.