రూ.35 కోట్ల చెల్లింపుపై బాంబే హైకోర్టును ఆశ్రయించిన సౌరవ్ గంగూలీ
- గతంలో గంగూలీకి, రెండు సంస్థలతో ఒప్పందం
- గంగూలీకి మేనేజర్లుగా ఆయా సంస్థలు
- ఒప్పందం విచ్ఛిన్నం
- ఆర్బిట్రేషన్ కు ఫిర్యాదు చేసిన గంగూలీ
- గంగూలీకి అనుకూలంగా తీర్పు
గతంలో తన క్రీడా వ్యవహారాలను పర్యవేక్షించిన రెండు సంస్థల నుంచి తనకు రావాల్సిన రూ.35 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు సంస్థలు తనకు రూ.35 కోట్లు పరిహారంగా చెల్లించాలని గతంలో ఆర్బిట్రేషనల్ ట్రైబ్యునలర్ ఆదేశాలు ఇచ్చిందని, ఆ ఆదేశాలు అమలయ్యేలా ఆ రెండు సంస్థలపై చర్యలు తీసుకోవాలని గంగూలీ కోరారు.
ఇంతకీ ఈ కేసు ఈ ఏంటంటే... గంగూలీ గతంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో గంగూలీ కికెట్ మేనేజ్ మెంట్ వ్యవహారాలను పర్సెప్ట్ టాలెంట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, పర్సెప్ట్ డి మార్క్ (ఇండియా) లిమిటెడ్ అనే రెండు సంస్థలు పర్యవేక్షించాయి. ఈ రెండు సంస్థలు గంగూలీకి మేనేజర్లుగా వ్యవహరించాయి. ఈ మేరకు గంగూలీకి, ఆ సంస్థలకు మధ్య ఒప్పందం కుదిరింది.
అయితే, ఈ ఒప్పందం విచ్ఛిన్నం కావడంతో గంగూలీ... ఆ ఒప్పందంలోని ఓ నిబంధన ఆధారంగా ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ గంగూలీకి రూ.14,49,91,000 చెల్లించాలని, దాంతో పాటు ఆ మొత్తానికి ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీ కూడా కలిపి ఇవ్వాలని పర్సెప్ట్ టాలెంట్ మేనేజ్ మెంట్ లిమిటెడ్, పర్సెప్ట్ డి మార్క్ (ఇండియా) లిమిటెడ్ సంస్థలను ఆదేశించింది.
ఈ ఆదేశాల అమలుకు గంగూలీ కోల్ కతా హైకోర్టును ఆశ్రయించగా, ఈ వ్యవహారం తమ పరిధిలోకి రాదని కోల్ కతా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే గంగూలీ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.