జీవో నెం.2 సస్పెన్షన్ ను స్వాగతించిన రాష్ట్ర పంచాయతీ పరిషత్

  • సర్పంచ్, సెక్రటరీల అధికారాలు వీఆర్ఓలకు బదలాయింపు
  • గతంలో జీవో తెచ్చిన ప్రభుత్వం
  • పిటిషన్ దాఖలు చేసిన తురకపాలెం సర్పంచ్
  • నేడు విచారణ కొనసాగించిన హైకోర్టు
  • కోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలన్న జాస్తి ఆంజనేయులు
గ్రామ సచివాలయాలకు మరిన్ని అధికారాలు బదలాయించే జీవో నెం.2ను హైకోర్టు సస్పెండ్ చేయడంపై రాష్ట్ర పంచాయతీ పరిషత్ అధ్యక్షుడు జాస్తి ఆంజనేయులు స్పందించారు. సర్పంచుల అధికారాలను జీవో-2 హరిస్తోందని అన్నారు. హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సర్పంచులు, గ్రామ కార్యదర్శుల అధికారాలను కొన్నింటిని వీఆర్ఓలకు బదలాయిస్తూ గతేడాది మార్చి 25న ఏపీ ప్రభుత్వం జీవో నెం.2 తీసుకువచ్చింది. అయితే ఈ జీవోను గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ సవాల్ చేశారు. దీనిపై నేడు విచారణ కొనసాగించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రానికి అధిపతి సీఎం అయితే, గ్రామానికి అధిపతి సర్పంచి అని, వారి అధికారాలను ఎలా బదలాయిస్తారని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. 


More Telugu News