మళ్లీ 'సర్కారువారి పాట' మొదలు!

  • బ్యాంకు స్కామ్ నేపథ్యంలో సాగే కథ 
  • కరోనా కారణంగా ఆగిన షూటింగు
  • మళ్లీ ఈ రోజున సెట్స్ పైకి
  • సంక్రాంతికి భారీ విడుదల  
మహేశ్ బాబు .. పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో, మహేశ్ బాబు కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగు 'దుబాయ్'లో జరిగింది. ఆ తరువాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతూ ఉండగా, కరోనా కారణంగా షూటింగు ఆపేశారు. కరోనా ఉద్ధృతి తగ్గడం వలన, ఈ రోజున హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగును మళ్లీ మొదలుపెట్టారు. మహేశ్ బాబు తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు.ఈ సినిమా షూటింగులో పాల్గొనే వాళ్లంతా కూడా ముందుగా కరోనా టెస్టులు చేయించుకున్నారు. నెగెటివ్ రిపోర్టు వచ్చిన తరువాతనే సెట్స్ పైకి వెళ్లారు. ఇక ఇప్పటి నుంచి పెద్దగా గ్యాప్ లేకుండా 3 నెలల పాటు చిత్రీకరణను జరిపి, షూటింగు పార్టును పూర్తిచేయనున్నట్టు చెబుతున్నారు. ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ రోజున టీజర్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. తొలిసారిగా కీర్తి సురేశ్ .. మహేశ్ బాబు జోడీ కడుతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను, 'సంక్రాంతి'కి విడుదల చేయనున్నారు. బ్యాంకు స్కామ్ చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.  


More Telugu News