ఏపీలో మరింతగా తగ్గిన కరోనా కేసులు.. పూర్తి వివరాలు ఇవిగో!
- 24 గంటల్లో 1,578 మందికి కరోనా పాజిటివ్
- రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది మృతి
- రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులు
ఏపీలో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో 62,657 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 1,578 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 305 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 31 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 3,041 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,24,421కి పెరిగాయి. మొత్తం 18,84,202 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 13,024 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,30,48,945 మంది శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది. మరోవైపు కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధరించని వారికి రూ. 100 జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించింది.