ఆస్ట్రేలియా క్రికెటర్ హాండ్స్ కాంబ్ కు కరోనా పాజిటివ్

  • వరుసగా కరోనా బారిన పడుతున్న క్రికెటర్లు
  • కౌంటీల్లో మిడిలెసెక్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న హాండ్స్ కాంబ్
  • ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా
కరోనా వైరస్ అంతర్జాతీయ క్రికెటర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ పీటర్ హాండ్స్ కాంబ్ కు కరోనా సోకింది. ప్రస్తుతం ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ను హాండ్స్ కాంబ్ ఆడుతున్నాడు. అక్కడే ఆయన కరోనా బారిన పడ్డాడు. ఇంగ్లండ్ క్రికెటర్లలో కూడా ఇప్పటికే ముగ్గురు కరోనాతో బాధపడుతున్నారు. వీరితో పాటు మరో నలుగురు సహాయ సిబ్బందికి కూడా కరోనా సోకింది.  

హాండ్స్ కాంబ్ కౌంటీల్లో మిడిలెసెక్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఛాంపియన్ షిప్ రెండో గ్రూప్ మ్యాచుకు దూరమయ్యాడు. హాండ్స్ కాంబ్ స్థానంలో ఐరిష్ ఆటగాడు టిమ్ ముర్తగ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. హాండ్స్ కాంబ్ ఫామ్ లో లేకపోవడంతో ఆసీస్ జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు. 2019 జనవరిలో ఇండియాతో జరిగిన మ్యాచులో చివరి టెస్ట్ ఆడాడు. 2019 ఫిబ్రవరిలో ఇండియాతో జరిగిన సిరీస్ లో చివరి టీ20 ఆడాడు.


More Telugu News