తిరుమల ఘాట్ రోడ్డులో హడలెత్తిస్తున్న చిరుత
- కొన్నిరోజుల వ్యవధిలో పలుమార్లు ప్రత్యక్షం
- ఓసారి రోడ్డు దాటుతూ కనిపించిన చిరుత
- మరోసారి చెట్టు కింద ఉండగా చూసిన యాత్రికులు
- జింకల కోసం వచ్చినట్టు భావిస్తున్న భక్తులు
తిరుమల క్షేత్రం దట్టమైన శేషాచల అడవుల మధ్య ఉన్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ల వల్ల కొండపైకి భక్తుల రాక తగ్గడంతో ఈ ప్రాంతంలో వన్యమృగాల సంచారం ఎక్కువైంది. గత రెండ్రోజులుగా తిరుమల ఘాట్ రోడ్డు ప్రాంతంలో ఓ చిరుత పలుమార్లు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. మొన్న చిరుత ఘాట్ రోడ్డు దాటుతుండగా, యాత్రికులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. నిన్న ఓ చెట్టు కింద ఉండగా భక్తుల కంటపడింది.
ఈ ప్రాంతంలో భక్తులు తరచుగా జింకలకు ఆహారం అందిస్తుంటారు. దాంతో జింకలు రహదారి పక్కకు రావడం ఇటీవల కాలంలో సాధారణంగా మారింది. ఇప్పుడా జింకలను వేటాడేందుకు చిరుత వస్తోందని భావిస్తున్నారు. కానీ చిరుత దెబ్బకు యాత్రికులు హడలిపోతున్నారు. ఘాట్ రోడ్డు ప్రాంతంలో తమ వాహనాల నుంచి కిందికి దిగాలంటేనే భయపడిపోతున్నారు.