'ఎఫ్ 3'కి హైలైట్ గా నిలిచే పిసినారి పాత్రలో సునీల్?
- షూటింగు దశలో 'ఎఫ్ 3'
- డబ్బు చుట్టూ తిరిగే కథ
- కోట పాత్రనే ప్రేరణ
- సునీల్ కి ఛాన్స్ అనే టాక్
అనిల్ రావిపూడి తన సినిమాల్లో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. కథ ఏదైనా అది ఆద్యంతం వినోదభరితంగా సాగాలనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు వెళుతూ ఉంటాడు. అందువల్లనే ఆయన సినిమాల్లో కామెడీ ఎపిసోడ్స్ నాన్ స్టాప్ గా నవ్విస్తూ ఉంటాయి. తన అభిమాన దర్శకుడు జంధ్యాల గారని తరచూ చెప్పే అనిల్ రావిపూడి, ఆయన సినిమాల్లో 'అహ నా పెళ్లంట' మరింత ఇష్టమని అంటూ ఉంటాడు. అందులోని ఒక పాత్రను ఆయన ఇప్పుడు 'ఎఫ్ 3'లో పెడుతున్నాడని అంటున్నారు.
'అహ నా పెళ్లంట' సినిమాలో కోట శ్రీనివాసరావు పోషించిన పిసినారి పాత్రను ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు. ఆ పాత్రను దృష్టిలో పెట్టుకునే అనిల్ రావిపూడి ఒక పాత్రను తనదైన స్టైల్లో క్రియేట్ చేశాడట. ఎందుకంటే 'ఎఫ్ 3' కథ అంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. అందువలన అవసరం .. అవకాశం ఉండటంతో ఆయన ఆ తరహా పాత్రకు రూపకల్పన చేశాడని అంటున్నారు. ఈ పాత్ర కోసం ముందుగా రాజేంద్రప్రసాద్ ను అనుకున్నారు. కానీ ఆల్రెడీ ఆ తరహా పాత్రలను ఆయన చేసి ఉండటం వలన, సునీల్ ను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు.