హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి నేను పోటీ.. టికెట్ ఖరారు: కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్
- కార్యకర్తతో ఫోనులో మాట్లాడిన కౌశిక్
- యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని వ్యాఖ్య
- ఇటీవల కేటీఆర్‌నూ కలిసి నేత
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఆ నియోజక వర్గంలో పోటీ చేయడానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ బయటకు వచ్చింది.
ఓ కార్యకర్తతో ఫోన్‌లో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ నుంచి పోటీచేయడానికి ఆ టికెట్ తనకే ఖరారైనట్లు తెలిపారు. ఎన్నిక నేపథ్యంలో యువతకు ఎంత డబ్బు కావాలో తాను చూసుకుంటానని అన్నారు. ఒక్కొక్కరికీ 2 లేక 3 వేల రూపాయల చొప్పున ఇస్తానని అన్నారు.
దీనిపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డిని కలవాలని ఆ కార్యకర్తకు కౌశిక్‌రెడ్డి చెప్పారు. కాగా, ఇటీవలే మంత్రి కేటీఆర్‌ను కూడా కౌశిక్‌రెడ్డి కలిశారు. కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ అవుతుండడం కలకలం రేపుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు జరుపుతున్నాయి. గతంలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఈటల చేతిలో కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డిని టీఆర్‌ఎస్ తనవైపునకు తిప్పుకుంటుందంటూ ప్రచారం జరుగుతోంది.