వర్జిన్ గెలాక్టిక్ రోదసి యాత్రకు అంతరాయం
- ప్రతికూల వాతావరణమే కారణం
- న్యూ మెక్సికోలో మారిన వాతావరణం
- 90 నిమిషాలు ఆలస్యంగా రోదసియానం
- ప్రకటించిన వర్జిన్ గెలాక్టిక్
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు అంతరాయం ఏర్పడింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం) ఈ రోదసి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ యాత్ర ప్రారంభానికి వేదికగా నిలిచే న్యూ మెక్సికోలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని వర్జిన్ గెలాక్టిక్ వర్గాలు వెల్లడించాయి. దాంతో అంతరిక్ష యానం 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానుందని తెలిపాయి.
వర్జిన్ గెలాక్టిక్ చేపడుతున్న ఈ రోదసి యాత్ర కోసం యూనిటీ 22 వ్యోమనౌకను ఉపయోగిస్తున్నారు. ఇందులో వర్జిన్ గెలాక్టిక్ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు వ్యోమగాములు ప్రయాణించనున్నారు.
వర్జిన్ గెలాక్టిక్ చేపడుతున్న ఈ రోదసి యాత్ర కోసం యూనిటీ 22 వ్యోమనౌకను ఉపయోగిస్తున్నారు. ఇందులో వర్జిన్ గెలాక్టిక్ అధినేత సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు వ్యోమగాములు ప్రయాణించనున్నారు.