​శిరీష బండ్ల అంతరిక్షయానం లైవ్ చూడాలంటే...!​

  • నేడు నింగికి ఎగరనున్న యూనిటీ 22
  • అంతరిక్ష యాత్ర చేపడుతున్న వర్జిన్ గెలాక్టిక్
  • వర్జిన్ సంస్థ అధిపతి కూడా యాత్రలో పాల్గొంటున్న వైనం
  • యాత్రలో పాల్గొంటున్న తెలుగమ్మాయి శిరీష బండ్ల
మరికాసేపట్లో వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర షురూ కానుంది. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6.30 గంటలకు యూనిటీ 22 వ్యోమనౌకతో కూడిన వాహకనౌక నింగికి ఎగరనుంది. దీంట్లో వర్జిన్ గెలాక్టిక్ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్ (70) తో పాటు నలుగురు వ్యోమగాములు ప్రయాణిస్తున్నారు. వారిలో భారత సంతతి తెలుగమ్మాయి శిరీష బండ్ల కూడా ఉన్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అరుదైన రోదసియాత్ర చేపడుతున్నారు. కాగా, దీన్ని లైవ్ లో తిలకించేందుకు వర్జిన్ గెలాక్టిక్ ఏర్పాట్లు చేసింది. ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఈ అంతరిక్ష ప్రయాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.


More Telugu News