300 యూనిట్ల కరెంట్ ఉచితం: అరవింద్ కేజ్రీవాల్
- ఉత్తరాఖండ్ ప్రజలకు ఢిల్లీ సీఎం హామీ
- అధికారంలోకి వస్తే ఇస్తామని ప్రకటన
- బిల్లు బకాయిలను రద్దు చేస్తామని హామీ
ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్న ఉత్తరాఖండ్ లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున హామీల జల్లు కురిపించారు. ఉచిత కరెంట్ తో పాటు కరెంట్ బిల్లుల బకాయిలు, తప్పుడు బిల్లులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో తమను అధికారంలోకి తీసుకొస్తే.. ఢిల్లీలోలాగా ఉత్తరాఖండ్ లోనూ కరెంట్ కోతలు లేకుండా చూస్తామన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ను అందిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి సీఎం అంటూ లేడని, తమ ముఖ్యమంత్రి చెడ్డవాడంటూ అధికార పార్టీయే చెబుతోందని ఆయన విమర్శించారు. సీఎం పదవి కోసం బీజేపీలో అంతర్గత పోట్లాటలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటు ప్రతిపక్షానికీ సరైన నేతలు లేరని అన్నారు. అలాంటప్పుడు ఉత్తరాఖండ్ అభివృద్ధిని పట్టించుకునేదెవరని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 20 నుంచి 22 సీట్లలో పోటీ చేయాలని ఆప్ భావిస్తోంది. కాగా, అంతకుముందు పంజాబ్ లోనూ కేజ్రీవాల్ ఇలాంటి హామీనే ఇచ్చారు. ఢిల్లీలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను అందిస్తున్నామని, పంజాబ్ లో 300 యూనిట్లను ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు.