నా దృష్టిలో పీసీపీ పదవి చాలా చిన్న విషయం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- ఢిల్లీలో కోమటిరెడ్డి పర్యటన
- విజ్ఞాన్ భవన్ లో కిషన్ రెడ్డితో భేటీ
- క్యాబినెట్ హోదా పొందడంపై అభినందనలు
- పార్టీ మారే ఆలోచనలేదని స్పష్టీకరణ
- రేవంత్ చిన్న పిల్లవాడంటూ వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఇటీవల క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ అందుకున్న కిషన్ రెడ్డిని విజ్ఞాన్ భవన్ లో కలిసిన కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపదగా భావించే భువనగిరి కోట అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ప్రణాళికలేవీ లేవని స్పష్టం చేశారు.
తన దృష్టిలో పీసీసీ పదవి చాలా చిన్న విషయం అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గురించి తన వద్ద ఎవరూ ప్రస్తావించవద్దని, తాను రాజకీయాలు మాట్లాడనని ఇటీవలే చెప్పానని వెల్లడించారు. అయినా రేవంత్ రెడ్డి చిన్న పిల్లవాడని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ ను ముందుకు నడిపించే సమర్థవంతమైన నేత లేడని అభిప్రాయపడ్డారు.