బోనాల పండుగ ప్రజల ఐకమత్యానికి ప్రతీక: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- నేటి నుంచి బోనాలు
- తెలంగాణకు పండుగ శోభ
- తెలంగాణ ప్రజలకు వెంకయ్య శుభాకాంక్షలు
- కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచన
తెలంగాణలో ఆషాఢం బోనాల శోభ సంతరించుకుంది. దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు ప్రబలకుండా, ఇతర సమస్యలు దరిచేరకుండా అమ్మవారిని ప్రార్థించే ఈ బోనాల పండుగ... ప్రజల ఐకమత్యానికి ప్రతీక అని అభివర్ణించారు. బోనాల పండుగ సందర్భంగా కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన నిబంధనలను పాటిస్తూ, ఆరోగ్య భారత నిర్మాణంలో మనమంతా భాగస్వాములమవుదాం అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.