తొలి ‘పారదర్శకత నివేదిక’ను విడుదల చేసిన ట్విట్టర్
- నెలనెలా విడుదల చేస్తామన్న సంస్థ
- 22 వేల ట్వీట్ల తొలగింపు
- 132 ట్వీట్లపై చర్యలు
కొత్త ఐటీ చట్టం అమలుపై కేంద్ర ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ట్విట్టర్.. ‘తొలి పారదర్శకత నివేదిక’ను విడుదల చేసింది. వినియోగదారుల ఫిర్యాదులు, దానికి సంస్థ తీసుకున్న చర్యలు, వివిధ వెబ్ లింకులు, యూఆర్ఎల్ ల తొలగింపునకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరిచింది. మే 26 నుంచి జూన్ 25 మధ్య తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించింది.
ఇక నుంచి ఈ నివేదికను ప్రతి నెలా విడుదల చేస్తామని సంస్థ వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చే సూచనలకు తగ్గట్టు కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ మరింత మెరుగుపరచుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పటిదాకా వినియోగదారులు ఇచ్చిన 37 ఫిర్యాదులను స్వీకరించామని, అందులో 20 ఫిర్యాదులు పరువుకు భంగం కలిగించేవని చెప్పింది. 132 ట్వీట్లపై చర్యలు తీసుకున్నామని, 22 వేల ట్వీట్లను తొలగించామని పేర్కొంది.
తొలగించిన ట్వీట్లలో 18 వేల ట్వీట్లు అసభ్య, చిన్నారులపై లైంగిక హింసకు సంబంధించినవని వివరించింది. మరో 4 వేల ట్వీట్లు ఉగ్రవాద సంబంధ ట్వీట్లని తెలిపింది. కాగా, ఈ నివేదికతో పాటు ‘సమాచార విజ్ఞప్తి’ నివేదికనూ ట్విట్టర్ విడుదల చేసింది. అందులో ప్రభుత్వ సమాచార వినతులను పొందుపరిచింది. దానికి సంబంధించిన అకౌంట్లను వెల్లడించింది.