హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక‌లో టీజేఎస్‌ పోటీ: కోదండ‌రామ్ ప్ర‌క‌ట‌న‌

  • ఆగస్టు నెలాఖ‌రులో పార్టీ ప్లీనరీ సమావేశం
  • టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామ‌ని త‌ప్పుడు ప్ర‌చారం
  • లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో ప్ర‌భుత్వం చెప్పాలి
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వ‌ర‌లో ఉప‌ ఎన్నిక జ‌ర‌గాల్సి ఉన్న విష‌యం తెలిసిందే. ఆ నియోజ‌క వ‌ర్గంలో పోటీ చేయడానికి ఇప్ప‌టికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటూ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ కూడా పోటీ చేయ‌నుంద‌ని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ ఈ రోజు మీడియాకు తేల్చి చెప్పారు.

త‌మ పార్టీ ఆగస్టు నెలాఖ‌రులో ప్లీనరీ సమావేశం నిర్వహించ‌నున్న‌ట్లు  కోదండరామ్ తెలిపారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, అందులో విలీనం చేసే ప్ర‌స‌క్తే లేద‌ని మ‌రోసారి ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో లక్ష ఉద్యోగాలు ఎక్కడ భర్తీ చేశారో ప్ర‌భుత్వం చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు.



More Telugu News