అందుకే ఇంటి ప‌న్నులు పెంచుతున్నారు: ఎమ్మెల్యే రాజాసింగ్

  • అప్పుల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్
  • కార‌ణం మంత్రి  కేటీఆర్
  • ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నేతలు  డబ్బులు పంచారు
  • ప్రజలు ఇప్పుడు పరిహారం చెల్లించుకోవటానికి సిద్ధం కావాలి
తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిప‌డ్డారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ అప్పుల ఊబిలో కూరుకుపోవ‌డానికి కార‌ణం కేటీఆరేన‌ని ఆరోపించారు. ఈ ప‌రిస్థితుల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇంటి పన్నులు పెంచటానికి సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలిపారు.

గ‌త జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచి గెలిచార‌ని, వారి నుంచి డ‌బ్బు తీసుకుని ఓట్లు వేసి‌న ప్రజలు ఇప్పుడు పరిహారం చెల్లించుకోవటానికి సిద్ధం కావాలని ఆయ‌న వ్యాఖ్యానించారు. పన్నుల రూపంలో డ‌బ్బును లాక్కోవ‌డానికి టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అన్నారు. ప‌న్నుల రూపంలో కోట్లాది రూపాయ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ జీహెచ్ఎంసీ అప్పుల్లో ఎందుకు మునిగిపోయిందో ఆ సంస్థ కమిషనర్ చెప్పాలని ఆయ‌న అన్నారు.



More Telugu News