జర్నలిస్టుపై ఐఏఎస్ అధికారి దాడి.. వీడియో వైరల్
- ఉత్తరప్రదేశ్‌లో ఘటన
- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు
- ఐఏఎస్ అక్రమాలకు పాల్పడ్డాడన్న జర్నలిస్టు
- విషయాన్ని బయటపెట్టినందుకే దాడి?
ఉత్తరప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఐఏఎస్ అధికారులు సైతం విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. ఓ టీవీ రిపోర్ట్‌ను ఐఏఎస్ అధికారి వెంటపడి పట్టుకుని కొట్టాడు.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మియాగంజ్‌లో చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(సీడీవో)గా విధులు నిర్వర్తిస్తోన్న దివ్యాన్షు పటేల్ జర్నలిస్టుపై దాడికి పాల్పడడంపై పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జర్నలిస్టు సెల్‌ఫోన్‌తో అక్కడ నెలకొన్న పరిస్థితులను షూట్ చేస్తుండగా దివ్యాన్షు పటేల్ రెచ్చిపోయాడు. పోలీసులు అడ్డుపడడంతో ఆ జర్నలిస్టు తప్పించుకోగలిగాడు.
కాగా, దివ్యాన్షు పటేల్ పై ఆ జర్నలిస్టు పలు ఆరోపణలు చేశాడు. ఓటింగ్‌లో పాల్గొనకుండా లోకల్ కౌన్సిల్ సభ్యులను కొందరిని కిడ్నాప్ చేశారని ఆయన చెప్పారు. ఇందులో దివ్యాన్షు ప్రమేయం కూడా ఉందని తెలిపాడు. ఆ ఘటనను వీడియో తీసినందుకే తనపై దాడి చేశాడని అన్నాడు. దీనిపై దివ్యాన్షు స్పందిచంలేదు. ఈ దాడి ఘటనపై జర్నలిస్టు నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు స్థానిక కలెక్టర్ తెలిపారు.