తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. నేడు, రేపు భారీ వర్ష సూచన
- రాష్ట్రంలో ఇప్పటికే చెదురుమదురు వర్షాలు
- బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం
- ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద ఇప్పటికే ఉపరితల ఆవర్తనం
తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు పడుతుండగా నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.
మరోవైపు బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. గాలులతో ఆ ప్రాంతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య గాలులతో ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.