తెలంగాణ మంత్రులకు సభ్యత, సంస్కారం లేవని తేలిపోయింది: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి
- మహిళా ఎంపీడీవోపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు
- ఎర్రబెల్లి క్షమాపణలు చెప్పాలన్న మాధవి
- మంత్ర పదవి నుంచి తొలగించాలని డిమాండ్
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళా ఎంపీడీవో విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి మాట్లాడుతూ ఎర్రబెల్లిపై మండిపడ్డారు.
తెలంగాణ మంత్రులకు సభ్యత, సంస్కారం లేవని కొల్లి మాధవి అన్నారు. సీఎంతో పాటు మంత్రులు మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తన ఇంట్లో ఉన్న మహిళలతో ఎర్రబెల్లి అలాగే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టడాన్ని మానాలని హితవు పలికారు. ఎర్రబెల్లిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.