తల్లి పాత్ర పోషించనున్న కాజల్ అగర్వాల్?
- తమిళ చిత్రం 'రౌడీ బేబీ'లో కాజల్
- తల్లీకూతుళ్ల సెంటిమెంటుతో కథ
- డీ-గ్లామరైజ్డ్ పాత్రలో కాజల్
- కీలక పాత్ర పోషిస్తున్న రమ్యకృష్ణ
అందాల కథానాయికలు ఎక్కువగా గ్లామరస్ పాత్రలు పోషించడానికే మొగ్గుచూపుతుంటారు. అయితే, ఈ పాత్ర పోషిస్తే ఆర్టిస్టుగా పేరొస్తుందన్న నమ్మకం కలిగినప్పుడు మాత్రం అందాలతారలు కూడా కొన్ని రకాల డీ-గ్లామరైజ్డ్ పాత్రలు చేయడానికి సై అంటూ వుంటారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కూడా అలాగే తల్లి పాత్ర పోషించడానికి రెడీ అవుతోంది.
ఇటీవల కాజల్ తమిళంలో 'రౌడీ బేబీ' అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో ఆమె ఓ అమ్మాయికి తల్లిగా సత్తా వున్న క్యారెక్టర్ చేయనుందని తెలుస్తోంది. తల్లీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందట. అలాగే, ఇందులో కాజల్ సాదాసీదాగా డీ-గ్లామరైజ్డ్ గా కనిపిస్తుందని అంటున్నారు. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనుంది.