భారత్ లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలెస్ మేయర్ ను నామినేట్ చేసిన బైడెన్

  • భారత్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న బైడెన్
  • రాయబారిగా ఎరిక్ గార్సెట్టి పేరును నామినేట్ చేసిన అధ్యక్షుడు
  • భారత్ తో బలమైన బంధాలను కోరుకుంటున్న బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి పేరును ఆయన నామినేట్ చేశారు. గార్సెట్టి ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ సిటీ మేయర్ గా ఉన్నారు. ఈ నియామకానికి సంబంధించి తొలి నుంచి గార్సెట్టి పేరు వినిపిస్తోంది. బైడెన్ యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించి ఏడు నెలలు అయింది. యూఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత భారత్ కు సంబంధించి ఆయన తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం ఇదే.

ట్రంప్ హయాంలో భారత్, అమెరికా బంధాలకు రాజకీయ రంగు కూడా తోడయింది. గత ఎన్నికల సమయంలో ట్రంప్ కు మోదీ బహిరంగంగానే మద్దతు పలికారు. అయితే, ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలు కాగా, బైడెన్ ఘన విజయం సాధించారు. మరోవైపు, తన హయాంలో కూడా భారత్ తో అమెరికా బంధాలు బలంగా ఉండాలని బైడెన్ కూడా కోరుకుంటున్నారు.


More Telugu News