అద్భుతమైన క్యాచ్ పట్టిన భారత మహిళా క్రికెటర్.. వీడియో ఇదిగో
- ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టుతో నిన్న జరిగిన తొలి టీ20
- మహిళా క్రికెటర్ హర్లిన్ డియోల్ అద్భుత క్యాచ్
- మెచ్చుకున్న లక్ష్మణ్
ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టుతో నిన్న జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ హర్లిన్ డియోల్ ఊహకందని రీతిలో క్యాచ్ పట్టి ఔరా అనిపించింది. మ్యాచులో 19వ ఓవర్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్ఉమన్ జోన్స్ భారీ షాట్ కొట్టింది. బంతి ఇక బౌండరీ అవతల పడి సిక్స్ ఖాయమని అందరూ అనుకున్నారు.
అయితే, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న హర్లిన్ డియోల్ గాల్లోకి ఎగిరి బంతిని లోపలికి తోసేసి, తాను బౌండరీ బయట అడుగుపెట్టింది. అంతలోనే.. ఆ బంతి గాల్లో ఉండగానే మళ్లీ బౌండరీ లోపలికి జంప్ చేసి క్యాచ్ పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ప్రశంసలు కురిపించింది. ఈ వీడియో చూసిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్రశంసలు కురపించారు.
క్రికెట్ ఫీల్డ్‌లో ఇలాంటి క్యాచ్‌లు పట్టడం చాలా అరుదుగా జరుగుతుందని, ఆమె పట్టింది ఓ టాప్ క్లాస్ క్యాచ్ అని కొనియాడారు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేయగా, ఛేజింగ్‌కు దిగిన భారత్ 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 54 రన్స్ చేసింది. అదే సమయంలో వర్షం పడడంతో డీఎల్ఎస్ విధానంలో ఇంగ్లండ్ 18 పరుగుల తేడాతో గెలిచింది. రేపు రెండో టీ20 జరుగుతుంది.