జ‌శ్వంత్ అంతిమ యాత్ర ప్రారంభం.. కుటుంబ స‌భ్యుల‌కు రూ.50 ల‌క్ష‌ల చెక్కు ఇచ్చిన ఏపీ హోంమంత్రి

  • జమ్మూకశ్మీర్ లో ఇటీవ‌ల జ‌శ్వంత్ వీర‌మ‌ర‌ణం
  • అంతిమ యాత్రకు త‌ర‌లివ‌చ్చిన‌ స్థానికులు
  • జ‌శ్వంత్ త్యాగం మ‌రు‌వ‌లేనిద‌న్న హోంమంత్రి
జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లా సుందర్‌బాని సెక్టార్‌లో రెండు రోజుల క్రితం ఉగ్ర‌వాదుల ఏరివేత కోసం నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో భార‌త‌ సైనికులు నాయబ్ సుబేదార్ శ్రీజిత్, జశ్వంత్ రెడ్డి మృతి చెందిన విష‌యం తెలిసిందే. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సొంత గ్రామం ద‌వివాదకొత్త‌పాలెంలో ఈ రోజు జ‌శ్వంత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతున్నాయి. ఆయ‌న అంతిమ యాత్రకు స్థానికులు త‌ర‌లివ‌చ్చారు.

ఈ సందర్భంగా ఆయ‌న ఇంటికి వెళ్లిన ఏపీ హోంమంత్రి సుచ‌రిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున వారికి రూ.50 ల‌క్ష‌ల చెక్కును అందించారు. చిన్న వ‌య‌సులోనే జ‌శ్వంత్ మ‌ర‌ణించ‌డం బాధాక‌ర‌మ‌ని ఆమె అన్నారు. దేశ ర‌క్ష‌ణ కోసం స‌రిహ‌ద్దుల్లో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన జ‌శ్వంత్ త్యాగం మ‌రు‌వ‌లేనిద‌ని చెప్పారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రికి ఉద్యోగం ఇప్పించేందుకు సీఎం జ‌గ‌న్‌తో మాట్లాడ‌తామ‌ని మీడియాకు చెప్పారు.  


More Telugu News