మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు విద్యార్థుల య‌త్నం.. ఉద్రిక్త‌త‌.. వీడియో ఇదిగో

  • నారాయణపేట జిల్లాలో కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌
  • ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు
  • పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కేటీఆర్
తెలంగాణ‌ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ రోజు నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు ప్ర‌య‌త్నించారు. అయితే, ఏబీవీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో కాసేపు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విద్యార్థుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో టీఆర్ఎస్ స‌ర్కారు నిర్ల‌క్ష్య ధోర‌ణిని విడనాడాల‌ని వారు నినాదాలు చేశారు.  

కాగా, త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నారాయణపేట ప్రభుత్వ ఆసుప‌త్రిలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన చిన్నారుల వార్డును ప్రారంభించారు. అలాగే, వెజ్, నాన్వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. అమరవీరుల స్మారక ఉద్యానవనంతో పాటు సింగారం క్రాస్ రోడ్డులో చేనేత కేంద్రం ప‌నుల‌ను కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేంద‌ర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.


More Telugu News