సాగునీటిని విద్యుదుత్పత్తికి వాడుకుంటున్న కేసీఆర్‌ను అడ్డుకోవాలి: టీజీ వెంకటేశ్

  • కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరుతాం
  • రాయలసీమ ప్రాజెక్టుకు గత రెండేళ్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలి
  • జగన్, కేసీఆర్ మధ్య వివాదాన్ని బీజేపీకి ఆపాదించడం తగదు: సీఎం రమేశ్
విలువైన తాగు, సాగునీటిని విద్యుదుత్పత్తి కోసం వాడుకుని నీటిని వృథాగా సముద్రంలో కలిపేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తక్షణం అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరనున్నట్టు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ చెప్పారు. కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కూడా కోరుతామన్నారు. ‘రాయలసీమ నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి’ అంశంపై నిన్న కర్నూలులో నిర్వహించిన సమావేశంలో టీజీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాయలసీమ ప్రాజెక్టులకు గత రెండేళ్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే, వేదవతి ప్రాజెక్టును తక్షణం పూర్తిచేయాలన్నారు. మరో ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. జగన్, కేసీఆర్ మధ్య విభేదాలను బీజేపీకి ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం తగదన్నారు.


More Telugu News