తగ్గిన బంగారం ధర.. రూ. 47 వేల దిగువకు పసిడి

  • గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు 
  • స్వచ్ఛమైన పసిడి ధర పది గ్రాములకు రూ. 451 తగ్గింపు
  • కిలో వెండిపై రూ. 559 డౌన్
పసిడి ధర క్రమంగా దిగొస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా గత కొన్ని రోజులుగా బంగారం ధర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ఢిల్లీలో నిన్న పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 451 తగ్గి రూ. 46,844కు దిగొచ్చింది. వెండి కూడా కిలోకు రూ. 559 తగ్గి రూ. 67,465కు చేరుకుంది.

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1805 డాలర్లుగా ఉండగా, వెండి ధర 25.93 డాలర్లుగా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 49,200గా ఉంది.


More Telugu News