టీడీపీ తీరు దొంగే దొంగ దొంగ అన్నట్టుంది: బాక్సైట్ అంశంపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పందన
- లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందం
- లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలంటూ ఆరోపణ
- స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్
- బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమని స్పష్టీకరణ
విశాఖ మన్యంలో సీఎం జగన్ బంధువులు లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ టీడీపీ నేతలు రౌతులపూడి వెళ్లి లేటరైట్ తవ్వకాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
టీడీపీ తీరు చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుందని ఎద్దేవా చేశారు. గత టీడీపీ పాలన సమయంలోనే అక్రమ మైనింగ్ తో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ సర్కారు వచ్చాక మైనింగ్ దోపిడీకి అడ్డుకట్ట పడిందని అమర్నాథ్ స్పష్టం చేశారు. 2 ఎకరాల నుంచి రూ.2 లక్షల కోట్లకు బాబు ఎలా ఎదిగారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో తవ్వకాలకు సంబంధించి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అమర్నాథ్ వెల్లడించారు. బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమని అన్నారు.