రాంకీ గ్రూపులో రూ. 300 కోట్ల బ్లాక్ మనీ గుర్తించాం: ఐటీ శాఖ

  • ఈ నెల 6న రాంకీ సంస్థలపై ఐటీ దాడులు
  • కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • రూ. 1,200 కోట్ల కృత్రిమ నష్టాలను చూపి పన్నులు ఎగ్గొట్టారన్న ఐటీ శాఖ
రాంకీ సంస్థపై ఐటీ శాఖ అధికారులు జరిపిన సోదాల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాంకీ గ్రూపుకు సంబంధించిన రూ. 300 కోట్ల బ్లాక్ మనీని గుర్తించామని ఐటీ అధికారులు వెల్లడించారు. రూ. 1,200 కోట్ల కృత్రిమ నష్టాన్ని చూపి పన్నులు ఎగ్గొట్టారని చెప్పారు. రూ. 300 కోట్ల బ్లాక్ మనీకి ట్యాక్స్ చెల్లించేందుకు రాంకీ సంస్థ యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు.

ఈ నెల 6న హైదరాబాదులో ఉన్న రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరిగాయి. అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో సోదాలు నిర్వహించిన అధికారులు... పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రాంకీలోని మేజర్ వాటాని సింగపూర్ వ్యక్తులకు అమ్మేశారని... రూ. 288 కోట్లకు సంబంధించిన పత్రాలను నాశనం చేశారని ఐటీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాంకీ అధినేత అయోధ్యరామిరెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.


More Telugu News