చంద్రబాబును జగన్ విమర్శించడం విడ్డూరంగా ఉంది: కాల్వ శ్రీనివాసులు
- అన్ని రకాలుగా జగన్ విఫలమయ్యారు
- జగన్ అసమర్థత వల్ల పోలవరం కూడా నెమ్మదించింది
- రాయలసీమ ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారు
గత రెండున్నరేళ్లలో రాయలసీమకు సీఎం జగన్ చేసిందేమీ లేదని మాజీ మంత్రి, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. జగన్ అసమర్థత వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా నెమ్మదించిందని అన్నారు. అన్ని రకాలుగా విఫలమైన జగన్ తమ అధినేత చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందని... ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. సీఎంగా ప్రమాణం చేయకముందే తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిసేలా చంద్రబాబు కృషి చేశారని... ఆయన వల్ల పోలవరం పనులు సాఫీగా కొనసాగాయని అన్నారు.
అయితే జగన్ తన అసమర్థత వల్ల పోలవరం పనులను పూర్తి చేయలేకపోతున్నారని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. జగన్ సీఎంగా ఉన్నంత కాలం గ్రావిటీ ద్వారా పోలవరం నీటిని తరలించే అవకాశమే లేదని అన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో హంద్రీనీవా కోసం రూ. 8 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని... జగన్ సీఎం అయ్యాక ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తో కుదుర్చుకున్న రహస్య ఒప్పందంతో రాయలసీమ ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జల వివాదాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.