షాపింగ్ మాల్‌లో ప్రత్యక్షమైన కొండచిలువ.. వీడియో వైరల్
- అమెరికాలో ఘటన
- కొండచిలువను పట్టుకున్న సిబ్బంది
- తిరిగి జూకు తరలింపు
ఓ కొండ చిలువ జూ లోంచి అదృశ్యమై షాపింగ్ మాల్‌లో ప్రత్యక్షమైంది. ఆ 12 అడుగుల కొండచిలువను చివరకు జూ సిబ్బంది సురక్షితంగా పట్టుకుని తిరిగి ఎన్‌క్లోజర్‌లో పెట్టారు. వారు ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా ఇది వైరల్ అవుతోంది. అమెరికాలోని లూసియానాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కారా అనే 12 అడుగుల కొండచిలువ రెండు రోజుల క్రితం బ్లూ అక్వేరియం జూ నుంచి తప్పించుకోవడంతో దాన్ని సిబ్బంది వెతికడం ప్రారంభించారు. చివరికి అది ఒక షాపింగ్‌మాల్‌లో గోడ సీలింగ్‌లో ఉందని సిబ్బంది తెలుసుకున్నారు. షాపింగ్‌మాల్ కు వెళ్లి సీలింగ్‌ను పగులగొట్టి కొండచిలువను బయటికి తీశారు. అనంతరం మళ్లీ జూ అక్వేరియంకు తరలించారు. మరోసారి ఆ కొండ చిలువ తప్పించుకోకుండా పటిష్ఠమైన ఎన్‌క్లోజర్‌లో దాన్ని పెట్టారు.