మాపై తాప్సీ సరదాగా చేసిన వ్యాఖ్యలవి!: సినీనటుడు విక్రాంత్
- హీరోయిన్ తాప్సీ పన్ను కొత్త సినిమా ‘హసీన్ దిల్‌రూబా’
- ఈ నెల 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్
- విక్రాంత్ మాసే, హర్షవర్ధన్ రాణేలపై తాప్సీ పలు వ్యాఖ్యలు
- రొమాంటిక్ సీన్లలో నటించేందుకు భయపడ్డారన్న వైనం
హీరోయిన్ తాప్సీ పన్ను కొత్త సినిమా ‘హసీన్ దిల్‌రూబా’ ఈ నెల 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల తాప్సీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించిన విక్రాంత్ మాసే, హర్షవర్ధన్ రాణే లపై పలు వ్యాఖ్యలు చేసింది.
వారిద్దరు రొమాంటిక్ సీన్లలో నటించేందుకు భయపడ్డారని, తన ఇమేజ్ గురించి భయపడ్డారో లేకపోతే ఇంకేదైనా కారణమో గానీ, తాను ప్రతిసారి ఈ విషయం గురించి దర్శకుడికి ఫిర్యాదు చేసేదాన్నని చెప్పుకొచ్చింది. దీనిపై విక్రాంత్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
తాప్సీ వ్యాఖ్యలను మీడియాలో పెద్దదిగా చేసి రాసుకొచ్చారని మండిపడ్డాడు. తాప్సీ చాలా సరదాగా ఉంటుందని, బాగా వాగుడుకాయ అని చెప్పాడు. ఐదు నిమిషాలకు మించి సైలెంట్‌గా ఉండలేదని, సరదాకి ఆమె తమ గురించి అలా మాట్లాడిందని తెలిపాడు. అయితే, మీడియాలో మాత్రం ఆమె తమ గురించి సీరియస్‌గా కామెంట్ చేసినట్లు వక్రీకరిస్తూ రాశారని చెప్పాడు.
అయినప్పటికీ, ఈ సినిమా కోసం తమకు కావాల్సినంత ప్రచారం దొరుకుతోందని చెప్పుకొచ్చాడు. తాము ఇటువంటి విషయాల గురించి ఎప్పుడూ బాధపడబోమని, నటనే తన మొదటి ప్రాధాన్యమని చెప్పాడు. ఒక్కోసారి రొమాంటిక్ సన్నివేశాల్లో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుందని, అయితే, నటుల మధ్య పరస్పర సహాయసహకారాలు ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులను అధిగమించవచ్చని తెలిపాడు.