తెలంగాణపై కేంద్రమంత్రికి విజయసాయిరెడ్డి ఫిర్యాదు
- కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన విజయసాయిరెడ్డి
- రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి
- తెలంగాణ ప్రభుత్వమే అక్రమ ప్రాజెక్టులు చేపడుతోంది
- వెంటనే వాటిని నిలుపుదల చేయించాలి
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులకు ఏపీ నేతల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఫిర్యాదు చేశారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఏపీ సర్కారుకి పూర్తిస్థాయి అనుమతులు ఇవ్వాలని విజయసాయి కోరారు. తెలంగాణ ప్రభుత్వమే అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని ఆరోపించారు. వెంటనే వాటిని నిలుపుదల చేయించాలని కేంద్ర మంత్రిని విజయసాయిరెడ్డి కోరారు.
అలాగే, కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని నోటిఫై చేయాలని, ఆ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విశాఖకు తాగునీటి సరఫరా కోసం చేబట్టిన ఏలేశ్వరం ప్రాజెక్టులో సగం ఖర్చు జల్ జీవన్ మిషన్ నుంచి కేటాయించాలని కోరామని విజయసాయి చెప్పారు.
కాగా, కృష్ణా జలాల కోసం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరి, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, విమర్శలు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. దీనిపై చర్చించడానికి వీలుగా కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు ఈ రోజు తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా పడింది.