ఏపీ ఆర్థికశాఖలో రూ. 41 వేల కోట్ల దుర్వినియోగంపై విచారణ జరగాలి: సీపీఐ రామకృష్ణ

  • జమా ఖర్చుల్లో లోపాలున్నాయని ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్ లేఖ రాశారు
  • సరైన లెక్కలు లేవని గవర్నర్ కు పీఏసీ ఛైర్మన్ ఫిర్యాదు చేశారు
  • నిధుల దుర్వినియోగానికి జగన్ బాధ్యత వహించాలి
ఏపీ ఆర్థికశాఖలో పెద్ద ఎత్తున రూ. 41 వేల కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. దీనిపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీ ఆర్థికశాఖ జమా ఖర్చుల నిర్వహణలో లోపాలున్నాయని ప్రిన్సిపల్ ఆడిటర్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని చెప్పారు.

రూ. 41 వేల కోట్ల నిధులకు సరైన లెక్కలు లేవని గవర్నర్ కు నిన్న పీఏసీ ఛైర్మన్ ఫిర్యాదు చేయడం గమనార్హమని ఆయన అన్నారు. ఈ నిధుల దుర్వినియోగానికి సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగంపై కాగ్ తో ప్రత్యేకంగా ఆడిట్ చేయించాలని అన్నారు.


More Telugu News