బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై మోసం కేసు.. 13న విచారణకు రావాలంటూ సమన్లు
- బీయింగ్ హ్యూమన్ జువెలరీ బ్రాండ్ స్టోర్ ఏర్పాటు
- సహకారం ఇస్తామని మోసం చేశారంటూ చండీగఢ్ వ్యాపారవేత్త ఫిర్యాదు
- సల్మాన్, ఆయన సోదరి అల్విరా సహా 8 మందిపై కేసు
చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై మోసం కేసు నమోదైంది. 2018లో రూ. 2-3 కోట్లతో తాను ఏర్పాటు చేసిన ‘బీయింగ్ హ్యూమన్ జువెలరీ’ బ్రాండ్ స్టోర్‌కు అవసరమైన సహాయ సహకారాలతోపాటు దానికి ప్రచారం కూడా నిర్వహిస్తామని సల్మాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్, బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సీఈవో హామీ ఇచ్చారని వ్యాపారవేత్త అరుణ్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే, హామీ మేరకు వారి నుంచి తనకు ఎలాంటి సహకారమూ అందలేదని ఆరోపించారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న చండీగఢ్ పోలీసులు సల్మాన్, అల్విరాఖాన్‌తోపాటు మొత్తం 8 మందికి సమన్లు జారీ చేశారు. విచారణ కోసం ఈ నెల 13న తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.