నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరిగి మాపైనే కేసులా?: కేసీఆర్‌పై ఏపీ విప్ గంగుల ధ్వజం
- రోజుకు 14, 15 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తి కోసం వినియోగిస్తున్నారు
- ఏపీపై కేసీఆర్ చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారు
- వైఎస్ లేకుంటే ప్రాణహిత-చేవెళ్ల ఎక్కడిది?
ఆంధ్రప్రదేశ్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా క్రూరంగా వ్యవహరిస్తున్నారని ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుదుత్పత్తి కోసం రోజుకు 14, 15 వేల క్యూసెక్కుల శ్రీశైలం జలాశయ నీటిని వినియోగిస్తున్నారని ఆరోపించారు.
శ్రీశైలం జలాశయంలో 854 అడుగులకు పైగా నీరు ఉంటేనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నీరు అందుతుందన్నారు. విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా తిరిగి తమపైనే కృష్ణా ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తక్కువ రోజుల్లోనే కృష్ణా జిలాలను తరలించాల్సి ఉండడంతోనే పోతిరెడ్డిపాడును విస్తరించినట్టు ప్రభాకర్‌రెడ్డి వివరించారు. నేడు తెలంగాణ నేతలు వైఎస్‌ను అదే పనిగా విమర్శిస్తున్నారని, ఆయనే లేకుంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎక్కడిదని ప్రశ్నించారు.