టీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారు: ఎల్.రమణ

  • ఎల్.రమణ పార్టీ మార్పుపై కొన్నిరోజులుగా ప్రచారం
  • నేడు ఎర్రబెల్లితో కలిసి సీఎం కేసీఆర్ తో భేటీ
  • సానుకూలంగా జరిగిన చర్చలు
  • అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకోనున్న రమణ
టీడీపీ తెలంగాణ చీఫ్ ఎల్.రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన టీఆర్ఎస్ లోకి వెళితే ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలున్నాయి. ఎల్.రమణ ఇవాళ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి తాజా పరిణామాలపై చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని ఎల్.రమణ వెల్లడించారు. దీనిపై తన అనుచరులతో చర్చించాల్సి ఉందని, వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వివరించారు. సీఎం కేసీఆర్ తో పలు అంశాలు మాట్లాడానని, సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళదామని ప్రతిపాదించారని రమణ తెలిపారు.

ఎల్.రమణను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. భేటీ అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ, రమణ అంటే కేసీఆర్ కు అభిమానమని తెలిపారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని, రమణను టీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించగా, రమణ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. చేనేత వర్గం నుంచి వచ్చిన రమణ వంటి వ్యక్తుల అవసరం టీఆర్ఎస్ కు ఉందని ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు.


More Telugu News