ముగిసిన కేంద్ర నూతన క్యాబినెట్ సమావేశం... కీలక నిర్ణయాలు ఇవే!
- నిన్న కేంద్ర క్యాబినెట్ విస్తరణ
- ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు సమావేశం
- పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
- కరోనా నివారణ లక్ష్యంగా ప్రత్యేక ప్యాకేజీ
నిన్న కేంద్ర క్యాబినెట్ ను విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నూతన క్యాబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో కరోనా నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో కొవిడ్ అత్యవసర స్పందన నిధి, రైతుల మౌలిక వసతుల కోసం భారీగా నిధి వంటి నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
క్యాబినెట్ నిర్ణయాలు...
క్యాబినెట్ నిర్ణయాలు...
- కొవిడ్ అత్యవసర స్పందన నిధి కింద రూ.23,123 కోట్ల వ్యయానికి ఆమోదం. ఇందులో రూ. 15 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుండగా, రూ.8 వేల కోట్లు రాష్ట్రాలకు కేటాయింపు
- ఈ ప్యాకేజీ జులై 2021 నుంచి మార్చి 2022 వరకు అమలు
- 736 జిల్లాల్లో పిల్లల చికిత్సా కేంద్రాలు
- కొత్తగా మరో 20 వేల ఐసీయూ బెడ్లు
- టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు
- రైతుల మౌలిక వసతుల నిధికి రూ.1 లక్ష కోట్లు
- ఈ నిధిని ఏపీఎంసీ వ్యవస్థలు వాడుకోవచ్చన్న కేంద్రం
- కొబ్బరి బోర్డు చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయం