డెల్టా వేరియంట్ ఎఫెక్ట్.. ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తున్న టోక్యో నగరంలో ఎమర్జెన్సీ
- జపాన్ లో మళ్లీ కరోనా విజృంభణ
- టోక్యోలో పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులు
- ఆగస్టు 22 వరకు ఎమర్జెన్సీ
- ఎమర్జెన్సీ నీడలో టోక్యో
ఈ నెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్నాయి. అయితే టోక్యోలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ కేసులు నానాటికీ అధికం అవుతుండడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం టోక్యోలో అత్యయిక పరిస్థితిని విధించింది. ఈ ఎమర్జెన్సీ ఆగస్టు 22 వరకు అమల్లో ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఒలింపిక్స్ జరిగినన్ని రోజులు టోక్యో నగరం ఎమర్జెన్సీ నీడలో కొనసాగనుంది.
ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో, ఒలింపిక్స్ క్రీడలకు ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు దాదాపు లేనట్టే. ఇటీవలి వరకు టోక్యోలో కరోనా కేసులు తక్కువ సంఖ్యలోనే రావడంతో, 10 వేల మంది స్థానిక అభిమానులను స్టేడియంలలోకి అనుమతించాలని ఒలింపిక్స్ నిర్వాహకులు భావించారు. తాజాగా డెల్టా వేరియంట్ విజృంభణతో వారి ప్రణాళికలు తల్లకిందులయ్యాయి.