'తిమ్మరుసు' విడుదల తేదీ ఖరారు!

  • విభిన్నమైన కథాంశంతో సత్యదేవ్
  • కథానాయికగా ప్రియాంక జవాల్కర్
  • ముఖ్యమైన పాత్రలో రవిబాబు
  • ఈ నెల 30వ తేదీన విడుదల
సత్యదేవ్ మొదటి నుంచి కూడా విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. అందువల్లనే చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సత్యదేవ్ ఏ పాత్రను పోషించినా, ఆ పాత్రలో తాను కనిపించకుండా ఉండటానికి తనవంతు ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన తాజా చిత్రంగా 'తిమ్మరుసు' షూటింగును పూర్తిచేసుకుంది. ఈ పాటికే ఈ సినిమా విడుదల కావలసింది. కానీ కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకుంది.ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ, రిలీజ్ డేట్ పోస్టర్ ను వదిలారు. మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సత్యదేవ్ సరసన నాయికగా ప్రియాంక జవాల్కర్ నటించగా, ఒక ముఖ్యమైన పాత్రలో రవిబాబు కనిపించనున్నాడు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, ఎలాంటి రిజల్ట్ ను రాబడుతుందో చూడాలి.


More Telugu News