జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో రఘురామ చిత్తశుద్ధితో ఉన్నా, సీబీఐ ఎందుకో ఉదాసీనంగా ఉంది: వర్ల రామయ్య
- జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు విచారణ
- లిఖితపూర్వక వాదనల సమర్పణకు నో చెప్పిన సీబీఐ
- స్పందించిన వర్ల రామయ్య
- జగన్ అన్ని శక్తులు ఉపయోగిస్తున్నారని వ్యాఖ్య
అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ విషయంలో ఫిర్యాదుదారుడు రఘురామరాజు చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు. ముద్దాయి జగన్ రెడ్డి సర్వశక్తులు ఉపయోగించి బెయిల్ రద్దు కాకుండా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, దర్యాప్తు బృందం సీబీఐ మాత్రం ఎందుకో తమ విధి నిర్వహణ పట్ల ఉదాసీనతతో ఉన్నట్టుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ విచారణ జరగ్గా... జగన్, రఘురామ తమ లిఖితపూర్వక వాదనలను కోర్టుకు సమర్పించగా, సీబీఐ మాత్రం లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే వర్ల వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు వర్ల తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ నెటిజన్ కు దీటుగా బదులిచ్చారు. తనకు గవర్నర్ పదవి రాలేదని వర్ల రామయ్య మనస్తాపం చెందాడంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, "గలివర్ దెబ్బ లిల్లీఫుట్స్ కు ఏం తెలుసు అజ్ఞాని బ్రదర్?" అంటూ వర్ల బదులిచ్చారు.