'మన్ కీ బాత్' కాదు 'పెట్రోల్ కీ బాత్' కార్యక్రమం పెట్టుకోండి: మోదీపై మమత ఫైర్
- పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై మమత మండిపాటు
- దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ నాశనం చేస్తున్నారని విమర్శ
- పెట్రోల్ ధరలు రోజూ పెరుగుతున్నా కేంద్ర కేబినెట్ అచేతనంగా ఉందని వ్యాఖ్య
భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తూ... ఇకపై 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని కాకుండా పెట్రోల్ కీ బాత్, డీజిల్ కీ బాత్, వ్యాక్సిన్ కీ బాత్ కార్యక్రమాలను పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతి రోజు పెట్రోలియం ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర కేబినెట్ అచేతనంగా ఉందని విమర్శించారు. బాబుల్ సుప్రియోను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించడం ద్వారా 2024 కంటే ముందుగానే బెంగాల్ లో బీజేపీ తన ఓటమిని కొని తెచ్చుకుందని అన్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తాను కామెంట్ చేయబోనని మమత వ్యాఖ్యానించారు.