కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కిషన్ రెడ్డి స్పందన
- రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటా
- కేంద్ర పథకాలు రెండు రాష్ట్రాలకు అందేలా చూస్తా
- విభజన అంశాల పరిష్కారానికి కృషి చేస్తా
ఈ సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. కేంద్ర సంక్షేమ పథకాలు తెలుగు రాష్ట్రాలకు అందేలా చూస్తానని అన్నారు.
ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రధాని మోదీ తనకు ఏ శాఖను అప్పగించినా చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డును హైదరాబాదుకు కేంద్ర ప్రభుత్వం కానుకగా ఇచ్చిందని చెప్పారు. దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని తెలిపారు. కేంద్ర మంత్రిగా కరోనా సమయంలో హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిని తొమ్మిదిసార్లు సందర్శించానని చెప్పారు.