నాగార్జున బ్యానర్లో మెగా హీరో.. భారీ పారితోషికం!
- 'ఉప్పెన'తో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్
- పలువురు నిర్మాతల నుంచి ఆఫర్లు
- ఆచితూచి ఒప్పుకుంటున్న వైష్ణవ్
- నాగార్జున బ్యానర్లో స్పోర్ట్స్ సినిమా
లేటెస్ట్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే స్టార్ అయిపోయాడు. అతను నటించిన 'ఉప్పెన' ఘన విజయం సాధించడంతో వైష్ణవ్ కు మంచి గుర్తింపు .. దానితో పాటు డిమాండ్ వచ్చేశాయి. పలువురు నిర్మాతలు భారీ ఆఫర్లతో అతనిని ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే, తాను మాత్రం కొత్త సినిమాలను ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో 'కొండపొలం' అనే చిత్రాన్ని చేసిన వైష్ణవ్.. తాజాగా అక్కినేని నాగార్జున బ్యానర్ అన్నపూర్ణ స్థూడియోస్ నిర్మించే సినిమాలో నటించడానికి అంగీకరించినట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుందని అంటున్నారు. ఇందులో వైష్ణవ్ హాకీ ఆటగాడిగా కనిపిస్తాడట.
ఈ చిత్రం ద్వారా పృథ్వీ అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను వైష్ణవ్ కు నాగార్జున ఐదు కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని ఇస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుంది.