'భళా తందనాన' నుంచి గరుడ రామ్ లుక్!

  • 'కేజీఎఫ్' నుంచి విపరీతమైన క్రేజ్
  • వివిధ భాషల్లో విలన్ రోల్స్ 
  • తెలుగులోను వరుస అవకాశాలు 
  • బర్త్ డే స్పెషల్ గా పోస్టర్ రిలీజ్ 
కేజీఎఫ్' సినిమా విడుదలైన తరువాత ఆ సినిమాలో 'గరుడ' రోల్ పోషించిన రామ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అప్పటి నుంచి వివిధ భాషల నుంచి ఆయనకి ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులోను ఆయన కెరియర్ పుంజుకుంటోంది. 'మహాసముద్రం' సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా .. పవర్ఫుల్ గా ఉండనుంది.ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఆయన 'భళా తందనాన' సినిమాలో విలన్ గా ఛాన్స్ కొట్టేశాడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న 'ఆనంద్ బలి' పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలోను ఆయన కొత్త లుక్ తో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు జోడీగా కేథరిన్ కనువిందు చేయనుంది.    


More Telugu News